మాజీ మంత్రి నారాయణ అరెస్ట్.. టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో..!

నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్ లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు నారాయణ భార్యను కూడా అదుపులోకి తీసుకుని, వారిని ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకైన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారంలో నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం తిరుపతి సభలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 

ఈనేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ వచ్చి నారాయణను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నారాయణను అదుపులోకి తీసుకున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన విద్యాసంస్థల సిబ్బంది ఏపీకి వెళ్లే మార్గంలో టోల్ గేట్ల వద్ద చేరుకున్నారు. టీడీపీ నేతలు కూడా అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైప నారాయణ బెయిల్ కి టీడీపీ నేతలు చిత్తూరు కోర్టులో పిటిషన్ వేయనున్నారు.  

Leave a Comment