ఉంగరాలతో పరీక్షకు పదోతరగతి విద్యార్థులు.. పరీక్ష అయిపోగానే పెళ్లట..!

చదుకోవాల్సిన వయసులో ప్రేమ, పెళ్లి అని పిచ్చి వేషాలు వేస్తున్నారు. మంచిగా చదువుకోకుండా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే.. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి, విద్యార్థిని కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

శుక్రవారం పరీక్షలకు చివరి రోజు కావడంతో పరీక్ష అయిపోగానే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అందుకోసం పరీక్ష వచ్చేటప్పుడు తమ వెంట ఉంగరాలు కూడా తెచ్చుకున్నారు. అయితే పరీక్ష జరుగుతున్నప్పుడు ఇన్విజిలేటర్ విద్యార్థులను తనిఖీ చేశారు. అప్పుడు ఓ విద్యార్థి జేబులో బంగారు ఉంగరం కనిపించింది. 

దీని గురించి ప్రశ్నించగా.. పరీక్ష అయిపోగానే మా క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, అందుకోసమే ఉంగరాలు మార్చుకునేందుకు దీనిని తీసుకొచ్చానని ఆ విద్యార్థి సమాధానం చెప్పాడు. దీంతో షాక్ అయిన ఇన్విజిలేటర్ ఆ బాలుడు చెప్పిన విద్యార్థిని వద్ద తనిఖీ చేశారు. ఆమె వద్ద కూడా ఉంగరం లభించింది. ఈ విషయం బయటపడకుండా ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులను వేర్వేరుగా ఇళ్లకు పంపించారు. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 

 

Leave a Comment