భారత మాజీ క్రికెటర్ యశ్ పాల్ శర్మ మృతి ..!

భారత మాజీ క్రికెటర్ యశ్ పాల్ శర్మ(66) మంగళవారం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. 1983 వరల్డ్ కప్ లో భారత జట్టు సభ్యుడిగా యశ్ పాల్ ఉన్నారు. ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన సెమీస్ లో 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు. లీగ్ దశలో వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక 83 వరల్డ్ కప్ ఆడిన సభ్యుల్లో మరణించిన తొలి క్రికెటర్ యశ్ పాల్ శర్మ కావడం విషాదకరం..

యశ్ పాల్ శర్మ 1978లో పాకిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశారు. టీమిండియా తరఫున 1978-83 మధ్య కాలంలో భారత మిడిలార్డర్ లో ఆయన కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరఫున 37 టెస్టుల్లో 1,606 పరుగులు, 42 వన్డేల్లో 883 పరుగులు చేశాడు. ఇక విండీస్ దిగ్గజం మాల్కమ్ మార్షల్ వేసిన బంతి యశ్ పాల్ శర్మ తలకు బలంగా తగలడంతో 1985లోనే ఆటకు వీడ్కోలు పలికాడు. కొన్నేళ్ల పాటు ఆయన జాతీయ సెలెక్టర్ గా ఉన్నారు.  

Leave a Comment