‘అతడు నా వెనకుంటే.. ఈ ప్రపంచంలో ఎవరూ నన్న బాధపెట్టలేరు’: రేణు దేశాయ్

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. పిల్లలే ప్రపంచంగా జీవిస్తోన్న రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తన కుమారుడు అకీరా నందన్, కూతురు ఆద్యాతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కుమారుడు అకీరా నందన్ తో దిగిన ఓ ఫొటోను రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 

అకీరా తన వెనకాల నిల్చొని ఉన్న సమయంలో సెల్ఫీ ఫొటో తీసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘అద్భుతమైన వ్యక్తి నా వెనకాల ఉన్నప్పుడు.. ఈ ప్రపంచంలో ఏదీ కూడా నన్ను బాధించలేదు. ఎవ్వరూ కూడా బాధపెట్టలేరు’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జత చేశారు.

 ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా రోజుల తర్వాత అకీరాకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం రేణు కూతురు ఆద్యా ఫొటోను కూడా షేర్ చేశారు రేణు దేశాయ్.. మొహానికి పెట్టుకోవాల్సిన మాస్క్ ను తలకు పెట్టుకున్న ఆధ్య ఫన్నీ ఫొటోను షేర్ చేశారు.    

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)

Leave a Comment