ఆ రెండు కోరికలు తీరకుండానే.. కత్తి మహేష్ కన్నుమూశారు..!

సినీ విమర్శకులు, నటుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.. గతనెలలో నెల్లూరు జిల్లాలో ఆయన కారు రోడ్డు ప్రమదానికి గురైంది. ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. అయితే తన కెరీర్ లో ఎన్నో ఘనతలు సాధించిన ఆయన ఓ రెండు కోరికలు తీరకుండానే ప్రాణాలు కోల్పోయారు. 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువు పూర్తయ్యాక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో కత్తి మహేష్ పలు ప్రయత్నాలు చేశారు. 2015లో పెసరట్టు అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అంతేకాదు హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సహా కొన్ని సినిమాల్లోనూ నటించారు. అయితే ఆయనక అంతగా గుర్తింపు రాలేదు.

 దీంతో ఎప్పటికైనా నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించాలని భావించారట.. ఆయన సన్నిహితులు, స్నేహితులతో ఈ విషయాన్ని చెప్పేవారట. అంతేకాదు రాజకీయాల్లోనూ రాణించాలని కత్తిమహేష్ కు కోరిక ఉండేదట. అయితే ఈ రెండు కోరికలు తీరకుండానే ఆయన మరణించారు.   

Leave a Comment