కొరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్ మరియు డయాబెటిక్ ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. డయాబెటీస్, గుండె జబ్బులు మరియు ఇతర సమస్యలతో పోరాడటానికి ఆరోగ్యకరమైన ఆహారం మరియు జీవనశైలిని మెయిన్ టైన్ చేయడం చాలా అవసరం. డయాబెటిస్ రోగులకు గుండె ఆరోగ్యానికి సహాయపడే కొన్ని చిట్కాలు తెలుసుకుందా..
మీ గుండెని ఆరోగ్యంగా ఉంచడం ఎలా?
1.ఆరోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం పెంచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. ఆహారంలో సోడియం, కొలెస్ట్రాల్ మరియు కొవ్వు శాతం తక్కువ ఉండేలా చూసుకోండి. ఎక్కవ ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు కలిగిన ఆహారాన్ని తీసుకోండి. ఆకుకూరలు మరియు ఇతర ఫైబర్ అధికంగా ఆహారంలో చేర్చుకోండి. డయాబెటిస్ కు రోజుకు 7-8 బాదం కూడా మంచిదే.
2.వ్యాయామం
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీని వల్ల అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, అధిక బరువు మరియు ఇతర సమస్యలకు అదుపులో పెట్టవచ్చు. దీంతో మీ గుండె కూడా పదిలంగా ఉంటుంది.
3.రెగ్యూలర్ చెకప్
రక్తంలో షుగర్ లెవల్స్ ని మీరు క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. వీటిలో హెచ్చు తగ్గులు ఉంటే వైద్య సహాయం అవసరం. రక్తపోటును కూడా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ఎందుకంటే గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి.
4.లక్షణాలను విస్మరించవద్దు..
ఊపిరి తీసుకోవంలో సమస్య, భూజాల్లో నొప్పి, మైకం, ఛాతీలో నొప్పి మరియు వికారం గుండె జబ్బు యొక్క కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలను విస్మరించవద్దు.
హెచ్చరిక – ఈ కంటెంట్ సాధారణ సలహాతో కూడిన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. ఇది వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీ వైద్యుడిని సంప్రదించండి.