నదిలో నీటిపై తేలియాడే రాయి.. ‘రామ్’ అని రాసి ఉండటంతో..!

ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో ఇషాన్‌ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయి నీటిపై తెలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఆ రాయిపై ‘రామ్’ అని హిందీలో రాసి ఉంది. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం జరుగుతోంది.

జులై 30న చేపల వేటకు వెళ్లిన స్థానికులకు ఈ రాయి దొరికింది. దీని బరువు 5.7 కిలోలు ఉన్నప్పటికీ నీటిలో తేలియాడుతుండటం అందరినీ ఆకర్షిస్తోంది.. దీంతో ఈ రాయిని చూసేందుకు స్థానికులు తండోపతండాలుగా వస్తున్నారు. మెయిన్‌పురీ జిల్లాలోని థానాబేవార్‌ పరిధిలోని అహిమాల్‌పూర్‌లో తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రాయిని ఆలయంలో ఉంచి స్థానికులు పూజలు జరుపుతున్నారు.

 

Leave a Comment