ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి..!

కరోనా మహమ్మారి గుంటూరు జిల్లాలో ఒక కుటుంబం మొత్తాన్ని కబళించి వేసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు కరోనాతో మరణించారు. అందులోనూ ఒకరు చనిపోయినట్టు మరొకరికి తెలియకుండా రోజుల వ్యవధిలోనే కుటుంబం మొత్తం మృత్యువాత పడటం హృదయవిదారకం..

గుంటూరు జిల్లా రాజుపాలెంలో పనిచేసి పదవీ విరమణ చేసిన షేక్ ఫరీద్ కుటుంబంలో ఈ పెను విషాదం చోటుచేసుకుంది. విశ్రాంత ఉపాధ్యాయులు అందరికీ చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉండే ఫరీద్ ఏప్రిల్ నెలలో కరోనా బారినపడి చికిత్ నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. 

అనంతరం ఫరీద్ కుటుంబ సభ్యులు సైతం ఒక్కొక్కరిగా కరోనా బారినపడ్డారు. వారందరూ వేర్వేరు చోట్ల ఆస్పత్రులలో చికిత్స పొందుతూ రోజుల వ్యవధిలోనే కన్నుమూశారు. గుంటూరులో చికిత్స పొందుతూ ముందుగా ఫరీద్ కుమార్తె మరణించింది. అనంతంర ఫరీద్ తల్లి.. తర్వాత ఫరీద్.. చివరకు అతడి భార్యతో పాటు 32 సంవత్సరాల కుమారుడు ఒకే రోజు మరణించారు. 

వీరిలో ఏ ఒక్కరి మరణం గురించి మరొకరికి తెలియకపోవడం  హృదయవిదారకం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య రీత్యా, ఆందోళనకు గురికాకూడదనే కారణంతో ఒకరి మరణ వార్తను మరొకరికి తెలియనీయకుండా బంధువులు జాగ్రత్త పడ్డారు. కుటుంబంలో ఒకరు మరణించారన్న సమాచారాన్ని మిగిలిన వారికి ఏవిధంగా తెలియజేయాలనే సందిగ్ధంలో తాము ఎంతో వేదన అనుభవించామని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Comment