ఇండియాలో వెంటనే లాక్ డౌన్ పెట్టండి : వైట్ హౌజ్ మెడికల్ అడ్వైజర్

ఇండియాలో కనీసం రెండు వారాలు లాక్ డౌన్ పెట్టాలని అమెరికా వైద్య నిపుణుడు, వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ సూచించారు. ఆ తర్వాత చైనాలో నిర్మించిన విధంగా తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించాలన్నారు. ఓ కేంద్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతే కాదు కరోనాపై గెలిచేశామంటూ భారత ప్రభుత్వం చాలా ముందుగా ప్రకటించిందని చురకలంటించారు. 

ఇండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, సాధ్యమైనంత ఎక్కువ కాలం దేశంలో లాక్ డౌన్ పెట్టాలని సూచించారు. అత్యంత వేగంగా చైనాలాగా హాస్పిటల్ నిర్మించాలని, ప్రస్తుతం ఇండియాలో హాస్పిటల్స్ చాలా అవసరమని పేర్కొన్నారు. మిలిటరీ సాయం తీసుకోవాలన్నారు. యుద్ధం సమయంలో హాస్పిటల్స్ ఎలా నిర్మిస్తారో అంత వేగంగా నిర్మించాలన్నారు. ఇండియాలో కేవలం 2 శాతం మందికే వ్యాక్సిన్ ఇవ్వడం చాలా తీవ్రమైన అంశమని, వ్యాక్సినేషన్ వేగం పెంచాలని ఫౌచీ స్పష్టం చేశారు. 

Leave a Comment