నందిగ్రామ్ లో రీకౌంటింగ్ కుదరదు : ఎలక్షన్ కమిషన్

బెంగాల్ ఎన్నికల్లో 200కు పైగా సీట్లతో విజయఢంకా మోగించిన టీఎంసీకి నందిగ్రామ్ లో చేదు అనుభవం ఎదరైంది. ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్లు ఆధిక్యం దోబూచులాడుతూ వచ్చింది. ఈ ఉత్కంఠ పోరులో చివరకు 1200 ఓట్లతో దీదీ గెలుపొందినట్లు అన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. కొద్ది గంటల తర్వాత టీఎంసీకి షాకింగ్ ఇచ్చేలా ఈసీ ప్రకటన చేసింది. ఇక్కడ సువేందు అధికారి 1736 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 

నందిగ్రామ్ లో మమత ఓటమిని జీర్ణించుకోలేని టీఎంసీ నేతలు అక్కడ రీకౌంటింగ్ చేయాలని పట్టుబట్టారు. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం రీకౌంటింగ్ కుదరదని తేేల్చిచెప్పింది. వీవీ ప్యాట్ స్లిప్స్ ను లెక్కించిన తర్వాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తామని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. అయితే కౌంటింగ్ ప్రక్రియపై టీఎంసీ అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాదు కోర్టుకు కూడా వెళ్తామని దీదీ ప్రకటించింది. 

 

Leave a Comment