మనిషి మొఖం తో చేప ! షాక్ అవుతున్న నెటిజన్లు ..!

మలేషియా కి  చెందినా జాలర్లు రోజు లాగే చేపలని పట్టుకొచ్చారు .అయితే అందులో ఒక చేప విచిత్రంగా కనిపిచటం ఒక జాలరి గమనించాడు .దానికి మనిషి ఆకారం లో ముఖం లాంటి నోరు ,దంతాలు ఉండటం తో ఏంటి ఇలా ఉంది అంటూ దాని మిగిలిన చేపలతో కలిపి అమ్మ కుండ పక్కన పెట్టాడు .ఆ తర్వాత దగ్గర్లోని ఓ చేపల పరిశోదన కేంద్రానికి తేసుకోవెళ్లారు . ఆ చెప్పాను పరిశోధకుల ముందు పెట్టారు .దాన్ని చుసిన పరిశోధకులు నోరు వెల్ల పెట్టి వావ్ అంటూ ట్రిగ్గర్ ఫిష్{Triggerfish}. భలే ఉంది… నీ వల్లో పడిందా?” అని అడిగారు. “అవును… దీని పేరేంటన్నారు… ట్రిగ్గర్ ఫిష్షా… ఇది ఇలా ఎందుకుంది?” అని అడిగాడు ఆ మత్స్యకారుడు. వెంటనే ఆ పరిశోధకుడు “అదే మరి మన భూమికి ఉన్న ప్రత్యేకత. ఇక్కడ రకరకాల జీవుల్ని మనం చూడగలం. వాటిలో ఇదో రకం” అన్నాడు. ఆశ్చర్యపు ఫేస్ పెట్టాడు ఆ ఫిషర్‌మేన్.

ఈ చేపలు కాస్త అరుదైనవే. ఇవి ఆస్నేయ ఆసియా సముద్ర జలాల్లో కనిపిస్తుంటాయి. పెద్ద పెద్ద పెదవులు, బలమైన దవడలు వీటికి ఉంటాయి. దంతాలు అచ్చం మనుషులకు ఉన్నట్లే ఉంటాయి. దీన్ని చూసిన వాళ్లు షాకవుతారు. ఎందుకంటే… చూడ్డానికి కాస్త భయంకరంగానే ఉంటుంది ఈ చేప.

 

ఈ చేప ఫొటోలు నెట్‌లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు దీనిపై రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమందైతే ఫొటోషాప్‌లో ఎడిటింగ్ చేసిమరీ క్రియేటివిటీ చూపిస్తున్నారు.మొత్తంగా ఈ చేప బాగుందని ఎవరూ అనట్లేదు. చాలా మందికి ఇది నచ్చట్లేదు. దీని ముఖం ఇలా ఉండటం వల్లే వారికి నచ్చట్లేదు.

Leave a Comment