ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మోడీ..!

మధ్య ప్రదేశ్ లోని రేవాలో ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. 750 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన రేవా అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ప్రతి సంవత్సరం 15 లక్షల టన్నుల విలువైన కార్బన్ డయాక్సైడ్ తో సమానమైన వాయువుల విడుదలను ఈ ప్లాంట్ తగ్గిస్తుందని ప్రధాని వెల్లడించారు. 

21వ శతాబ్దంలోనే ఇంధన అవసరాలు తీర్చడంల సౌర విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. రేవాలో సౌరవిద్యుత్ ప్లాంట్ రాకతో ఈ ప్రాంత పరిశ్రమలకు విద్యుత్ సరఫరాతో పాటు ఢిల్లీ మెట్రో రైల్ కు కూడా ఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. షాజపూర్. నీముచ్, చత్తార్ పూర్ లో కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని వివరించారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ) మరియు మధ్య ప్రదేశ్ ఉర్జా వికాస్ నిగమ్(ఎమ్పీయూవీఎన్ఎల్) ల జాయింట్ వెంచర్ అయిన రేవా అల్ట్రా మెగా సోలార్ 250 మెగావాట్ల చొప్పున మూడు సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను కలిగి ఉంది. 

 

 

Leave a Comment