ఏపీ పభుత్వ కీలక నిర్ణయం..కరోనా క్వారంటైన్ కిట్ లు ఇంటికే !

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా… వారికి కావాల్సినవాటిని వారి ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా హోమ్ క్వారంటైన్ కిట్ ను పంపించనుంది. ఈ కిట్ లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఆక్సీమీటర్ ఉంటాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉండి హోం క్వారంటైన్ లో ఉన్న వారికి ఈ కిట్ ను అందిస్తారు..

corona virus

లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే… ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది.

<c/center>

You might also like
Leave A Reply

Your email address will not be published.