వీడియో వైరల్: చేతి పంపు నుంచి నీటితో పాటు మంటలు..!

చేతి పంపు నుంచి నీళ్లతో పాటు మంటలు రావడం ఎప్పుడైనా చూశారా? కానీ, మధ్యప్రదేశ్ లోని ఒక గ్రామంలో చేతి పంపు నుంచి మంటలు వచ్చాయి. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఛతర్ పూర్ లోని కాచర్ గ్రామంలో చోటుచేసుకుంది. చేతి పంపులో నీరు, మంటలు ఒకేసారి ఎలా వస్తాయని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. 

గ్రామంలో రెండు చేతి పంపులు ఉన్నాయి. వాటి నుంచి గ్రామస్తులు నీటిని తెచ్చుకుంటారు. అయితే బుధవారం ఉదయం నుంచి ఓ చేతి పంపు నుంచి ఆటోమేటిక్ గా మంటలు, నీళ్లు రావడంతో ప్రజలు భయపడ్డారు. వెంటనే స్థానిక అధికారులకు విషయం తెలియజేశారు.

ఈ వీడియో క్లిప్ ని ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి గుర్మీత్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘చేతి పంపు నుంచి మంటలు, నీరు బయటకు వస్తున్నాయి.’ అంటూ ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ క్లిప్ వైరల్ గా మారింది. 

Leave a Comment