మత్తుమందు ఇవ్వకుండా.. చిరంజీవి సినిమా చూపిస్తూ సర్జరీ..!

సాధారణంగా సర్జరీ చేయాలంటే వైద్యులు మొదట ఏం చేస్తారు? పేషంట్ కి మత్తు మందు ఇస్తారు.. ఆ తర్వాత ఆపరేషన్ చేస్తారు.. కానీ ఎలాంటి మత్తు మందు ఇవ్వకుండా వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్ చేశారు. అదికూడా సినిమా చూపిస్తూ.. రెండు గంటల పాటు సర్జరీ చేశారు. ఈ సర్జరీ ఎక్కడో విదేశాల్లో జరగలేదు.. సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో జరిగింది. 

యాదాద్రి భువనగిరికి చెందిన 50 ఏళ్ల మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల గాంధీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది. వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి.. ఆమె మెదడులో కణతులు ఉన్నట్లు గుర్తించారు. గురువారం సర్జరీ చేసి ఆమె మెదడులో కణతులను తొలగించారు. అయితే పేషంగ్ కి ఎలాంటి మత్తివ్వకుండా, మెలకువగా ఉన్నప్పుడే ఈ సర్జరీ చేశారు. 

సర్జరీ చేసే సమయంలో ఆమెతో వైద్యులు మాట్లాడుతూ ..తన అభిమాన నటలు వివరాలను తెలుసుకున్నారు. ట్యాబ్ లో చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమా చూపిస్తూ రెండు గంటల పాటు సర్జరీ చేసి మెదడులోని కణతులను తొలగించారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సర్జరీని వైద్య పరిభాషలో అవేక్ క్రేనియటోమీ అంటారని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో వైద్యులు సర్జరీ చేస్తుంటే.. మిగితా సిబ్బంది ఆమెను పలకరిస్తూ సినిమాలోని స్టోరీ అడుగుతూ కాలక్షేపం చేశారు.    

 

 

Leave a Comment