అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం..!

ఆంధ్రప్రదేేశ్ లోని తూర్పగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్థమైంది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నప్రమాదంలో షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆకతాయిలు చేశారా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.  40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు. 

విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండన

అంతర్వేది ఘటన దురదృష్టకరమని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలన్నారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమన్నారు. నర్శింహస్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలని తెలిపారు. 

మంత్రి వెల్లంపల్లి దిగ్భ్రాంతి 

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంపై మంత్రి వెల్లంపల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై దేవదాయ కమిషనర్ పి.అర్జునరావు, జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. స‌హాయ‌క చ‌ర్యులు చేప‌డుతున్న దేవ‌దాయ, పోలీస్‌, పైరింజ‌న్‌, రెవెన్యూ అధికారుల‌తో మంత్రి ఫోన్‌ల్లో మాట్లాడారు..విచార‌ణ అధికారిగా దేవ‌దాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రామ‌చంద్ర‌మోహ‌న్‌ను నియ‌మించారు. ఘ‌ట‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, దేవ‌దాయ శాఖ అధికారుల‌తో పాటు పోలీసులు సంబంధిత అధికారుల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని అధికారుల‌ను అదేశించారు…

 

 

Leave a Comment