దేశంలో ఫైల్ షేరింగ్ వెబ్ సైట్ బ్యాన్..

ప్రముఖ ఫైల్ షేరింగ్ సైట్ wetransfer.com ని నిషేధించినట్లు టెలీకమ్యూనికేషన్ శాఖ పెర్కొంది. జాతీయ భద్రత మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అలా చేసినట్లు తెలిపింది. ఈ వెబ్ సైట్ యూఆర్ఎల్ ను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. 

Wetransfer అనేది వెబ్ లో ఒక ప్రముఖ ఫైల్ షేరింగ్ వెబ్ సైట్. ఇది ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది వినిగదారులను కలిగి ఉంది. 

భారతదేశంలో లాక్ డౌన్ ఈ వెబ్ సైట్ ను ఎక్కువగా ఉపయోగించారు. ఈ వెబ్ సైట్ ద్వారా 2జీబీ వరకు ఫైళ్లను ఈజీగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.  ఈ  ఫైళ్లను పంపించేందుకు ప్రత్యేకంగా ఖాతాను సృష్టించాల్సిన అవసరం లేదు. పెయిడ్ ద్వారా అయితే ఎక్కువ సామర్థ్యం గల ఫైళ్లను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది దీనిని ఉచితంగానే వినియోగించుకుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వెబ్ సైట్ ను ఎందుకు నిషేధించిందనే దానిపై స్పష్టత లేదు. 

Leave a Comment