11 ఏళ్ల కనిష్టానికి భారత జీడీపీ

కరోనా వైరస్ ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయికి దిగజారినట్లు జాతీయ గణాంక సంస్థ వెల్లడించింది. ఇక జనవరి-మార్చి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతంగా నమోదు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం 2019-20 మొత్తానికి 4.2శాతంగా నమోదైంది. 

ఇది గతేడాది త్రైమాసికంతో పోల్చితే చాలా తక్కువ. 2018-19లో భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా ఉంది. ఇప్పుడు భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 4.2 శాతానికి పడిపోయింది. కరోనా వైరస్ ప్రభావంతో దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉత్పత్తి, సేవ రంగాలతో పాటు అన్ని రంగాలపై ప్రభావం చూపింది. దీంతో ఆ ప్రభావం భారత్ పై పడింది. కోవిడ్-19 లాక్ డౌన్ తో తయారీ, సేవా రంగాలు నిలిచిపోయిన క్రమంలో భారతదేశ జీడీపీ వృద్ధిపై అది పాక్షిక ప్రభావం చూపింది. 

Leave a Comment