ఈ యువరైతు ఐడియా భేష్.. ఎద్దుల భారాన్ని తగ్గించేందుకు..!

ఒకప్పుడు రవాణా కోసం ఎడ్ల బండ్లనే ఉపయోగించేవారు.. ఎడ్లు అంత భారాన్ని కూడా తమ మెడపై మోస్తాయి.. అయితే కొందరు యువకులు మాత్రం ఎడ్ల భారాన్ని తగ్గించడానికి వినూత్న ఐడియా చేశారు. బండి ముందు మూడో చక్రం ఏర్పాటు చేశారు. దీంతో ఎద్దుల మెడ, వెన్నుపూసపై భారం పడదు. కనుక ఎద్దులు మరింత సులువుగా బండిని లాగగలవు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అయితే ఈ క్రియేషన్ ఎవరూ చేశారో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. కొంత మంది ఆదిలాబాద్ లో ఔత్సాహిక యువకులు దీన్ని తయారు చేశారని చెబుతుంటూ.. మరికొందరు మాత్రం మహారాష్ట్రకు చెందిన విద్యార్థులు దీనిని ఆవిష్కరించారని చెబుతున్నారు. ఏదీ ఏమైనా.. ఈ వినూత్న ఐడియాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

 

Leave a Comment