‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూస్తూ.. గుండెపోటుతో అభిమాని మృతి..!

అనంతపురంలోని సినిమా థియేటర్ లో విషాదం జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసేందుకు వెళ్లిన ఓ అభిమాని థియేటర్లోనే ప్రాణాలు కోల్పోయాడు. సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. 

ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ సినిమాను మొదటి రోజూ చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బెనిఫిట్ షోలు చూసేందుకు పలు ప్రాంతాల్లో అభిమానులు ఎగబడ్డారు.. ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షో చూస్తూ అనంతపురానికి చెందిన ఓబులేసు(30) అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. 

తన అభిమాన హీరో యాక్షన్ కి ఈలలు వేస్తూ.. ఆ సీన్ల ఫొటోలు తీసుకుంటూ.. హఠాత్తుగా కింద పడిపోయాడు. దీంతో అతడితోపాటు వచ్చిన వాళ్లు అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

 

Leave a Comment