‘మనల్ని బతకనీయరు స్వామీ’.. ఇదీ ఓ సామాన్యుడి ఆవేదన..!

ప్రస్తుతం దేశంలో ధరల పెరుగుదల మంటపుట్టిస్తోంది. ఇంధన ధరలు రాకెట్ లా పరిగెత్తుతున్నాయి. వంట నూనె కనొబోతే.. సల సల కాగిపోతోంది. మిగితా నిత్యావసర వస్తువుల ధరలు మోత మోగిస్తున్నాయి. కొత్తగా కరెంట్ ఛార్జీల పెరుగుదల.. మరో వైపు పెరుగుతున్న ధరలను చూసి సామాన్యులు తల్లడిల్లిపోతున్నారు.

ధరల పెరుగుదలపై ఎవర్నీ అడగాలో..ఎవరికి చెప్పుకోవాలో తెలీక సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. అయితే హైదరాబాద్ లో ఓ సామాన్యుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. తన ఆవేదనను ఓ పలకపై రాశాడు.. ‘అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ మనల్ని బతకనీయరు స్వామీ.. పెట్రోల్ 150 దాటించేస్తారు. నూనె, కరెంట్, గ్యాస్.. ఇంకా చాలా నిత్యావసర వస్తువులు మోత మోగిస్తారు. మనకు వచ్చే జీతాలు అంతే ఉంటాయి. ఖర్చు రూ.700, ఆదాయం రూ.500’.. అంటూ ఓ బైక్ వెనకాల పలకపై రాశాడు. ఈ చిత్ర హైదరాబాద్ లోని మలక్ పేటలో దర్శనమిచ్చింది.   

ధరల పెరుగుదలతో ఇబ్బంది పడేది సామాన్యులే.. ధనవంతుల పరిస్థితి బాగానే ఉంటుంది. ప్రైవేట్ కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే సామాన్యుల పరిస్థితి చెప్పలేనిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేమో తమకు సమస్యలు ఏమీ లేనట్టు.. కేవలం మతం, కులం అంటూ విమర్శలు చేసుకుంటూ బండి నడిపిస్తున్నాయి. ప్రజలు కూడా వీటిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారే.. కానీ సమస్యలు, ధరల పెరుగుదల గురించి ప్రశ్నించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా వారిని అలా మార్చేశాయి.. కానీ సగటు సామాన్యుడి సమస్య తీరేదెప్పుడు?..వారు సంతోషంగా ఉండేదెప్పుడు?..   

 

 

 

Leave a Comment