బాబా అవతారమెత్తిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. పూజలు, హోమాల పేరుతో..!

ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బాబా అవతారమెత్తాడు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలతో బాధపడే వారి సమస్యలు తీరస్తానని చెప్పి భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తాడు.. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం అజ్మాపురంలో పది ఎకరాల స్థలంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని, కొంత కాలంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ బురిడీ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కృష్ణా జిల్లాకు చెందిన సాయి విశ్వ చైతన్య హైదరాబాదులో పుట్టి పెరిగాడు. బీటెక్ పూర్తి చేసిన అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. పీఏపల్లి మండలంలోని అజ్మాపురంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, తాయత్తులు కడుతూ, హోమాలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకున్నాడు. 

ఈ సాఫ్ట్ వేర్ బాబాపై ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు బాగుచేస్తానని నమ్మించి డబ్బులు తీసుకుని మోసగించాడని పేర్కొంది. దీంతో ఎస్పీ రంగనాథ్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించారు. ఆశ్రమంలో ఉన్న సాయి విశ్వ చైతన్యను అరెస్టు చేశారు. అతడి వద్ద నగదు, బంగారు ఆభరణాలు, విలువైన డిపాజిట్ బాండ్లు, ల్యాప్ టాప్ లు, ప్రవచన బుక్కులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బురుడీ బాబా మోసాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Leave a Comment