RRR Dosti Song: ఆర్ఆర్ఆర్ నుంచి దోస్తీ పాట వచ్చేసింది..!

ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది. ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేసింది ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్.. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ను విడుదల చేశారు. ఎం.ఎం. కీరవాణి సంగిత దర్శకత్వంలో ‘దోస్తీ’ అంటూ సాగే చివర్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించారు. 

ఈపాటను ఒక్కో భాషలో ఒక్కో సింగర్ తో పాడించారు. తెలుగులో హేమచంద్ర, తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో అమిత్ త్రివేదీ, మలయాళంలో విజయ్ యేసుదాసు, కన్నడలో యాజిన్ నిజార్ పాడారు. తెలుగులో ఈ పాటకు సినివెన్నెల సీతారామశాస్త్రీ సాహిత్యం అందించగా, తమిళంలో మదన్ కర్కి, హిందీలో రియా ముఖర్జీ, కన్నడలో ఆజాద్ వరదరాజ్, తమిళంలో మన్ కొంబు గోపాలక్రిష్ణ రాశారు. ఈపాట కోసం ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్ వేసినట్లు సమాచారం..

కాగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇటీవల ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదల చేసి భారీ అంచనాలను పెంచారు. 

 

 

Leave a Comment