త్వరలో ఫేస్ బుక్ న్యూస్..!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రచురణకర్తలకు గుడ్ న్యూస్ అందించింది. పలు దేశాల్లో ఫేస్ బుక్ న్యూస్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. కంటెంట్ కు తగిన పారితోషికం కూడా చెల్లించనుంది. ఇప్పటికే అమెరికాలో వార్తా సేవల్ని ప్రారంభించింది. తాజాగా ఈ సేవలను భారత్, బ్రెజిల్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ దేశాల్లోకి విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఆరు నెలల్లో ఈ మేరకు విధివిధానాలను రూపొందించనుంది. 

కంటెంట్ క్రియేటర్స్, పబ్లిషర్లకు ఫేస్ బుక్ డబ్బు చెల్లించేందుక సిద్ధంగా ఉన్నట్లు ఫేస్ బుక్ గ్లోబల్ న్యూస్ పార్లనర్ షిప్స్ ప్రెసిడెంట్ కాంప్ బెల్ బ్రౌన్ వెల్లడించారు. దేశ, విదేశాల్లో ఉన్న వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా కంటెంట్ క్రియేట్ చేసి సరొకొత్త బిజినెస్ మోడల్ తో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. 

 

Leave a Comment