నీటిలో కూర్చొని ఒకే శ్వాసలో ఆరు రూబిక్స్ క్యూబ్స్ పరిష్కరించి రికార్డు సాధించాడు..!

సాధారణంగా నీటి లోపల శ్వాస తీసుకోకుండా ఒక్క నిమిషం కోర్పోవడం అంటే సాహసమే..అలాంటిది 2.17 నిమిషాల పాటు నీటి లోపల కూర్చోని ఆరు రూబిక్స్ క్యూబ్స్ లను పరిష్కరించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు..

చెన్నైకి చెందిన 25 ఏళ్ల యువకుడు ఇల్లారాయం సేకర్ యోగా ధ్యాన శ్వాస పద్ధతులను ఉపయోగించి నీటితో నిండిన ఒక కంటైనర్ లో కూర్చున్నాడు..ఈ నీటి లోపల ఒకే శ్వాసలో ఏకంగా ఆరు రూబిక్స్ క్యూబ్స్ లను పరిష్కరించాడు. ఇందు కోసం 2.17 నిమిషాల సమయం తీసుకున్నాడు.  భారతదేశం తరపున అత్యధిక నీటిలో అత్యధిక రూబిక్స్ క్యూబ్స్ పరిష్కరించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.. 

Leave a Comment