ప్రధాని షేర్ చేసిన ఈ అద్భుతం ఎక్కడుందో తెలుసా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ అద్భుతమైన దృశ్యాన్ని షేర్ చేశారు. ఈ వీడియోలో వర్షం కురుస్తుండగా..ఆ నీరు గుడి మెట్లపై పారుతూ ఉంటుంది. ఇది చూసేందుకు ఎంతో అపురూపంగా, ఎంతో మనోహరంగా ఉంది. ఇది గుజరాత్ లోని సూర్యదేవాలయంలో గల సూర్యకుండ్ దృశ్యాలు..వర్షంలో సూర్యకుండ్ దృశ్యాలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘మొధేరా యొక్క ఐకానిక్ సన్ టెంపుల్ వర్షపు రోజున చాలా ఐకానిక్ గా కనిపిస్తుంది’ అని ట్వీట్ చేశారు. దీంతో పాటు 55 సెకన్ల వీడియోను పోస్ట్ చేశారు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మీరు చూడండి…

మొధెరా సూర్యా దేవాలయం పుష్పవతి నదికి సమీపంలో ఉంది. ఇది గుజరాత్ లోని మహసానా జిల్లాలో గలదు. సోలంకీ రాజైన రెండవ భీందేవ్ క్రీ.శ 11వ శతాబ్దంలో ఈ సూర్యదేవాలయాన్ని నిర్మించారు. ఇది చోళుల కాలం నాటిది. కనుచూపుమేరలో కొండకానీ, రాయిగానీ లేనిచోట కొన్ని మైళ్ల నుంచి రాయిని తొలచి నదికి 10 అడుగులకు పైగా ఇటుకలతో గట్టిపునాదులు వేయించి రాయిని దూలాలు, స్తంభాలు, మూర్తులుగా చిత్రికరించారు. ఎక్కడా సున్నంతో టాకీ వేయకుండా రాయిలో రాయి అమర్చి నిర్మించారు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.