పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం వడ్డన..

అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనమవుతున్నా..కేంద్ర ప్రభుత్వం మాత్రం వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజల్ పై ఎక్సైజ్ సుంకన్నా పెంచుతూ నిర్ణయం తీసకుంది. ఎప్పుడూ లేనంతగా ముడి చమురు ధరలు పడిపోయినా..భారత్ లో మాత్రం కొన్ని పైసల్లో తగ్గిస్తూ వస్తున్నారు. ఇవాళ లీటర్ పెట్రోల్ పై పెట్రోల్, డీజిల్ పై రూ.3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరగనున్నాయి. పెట్రలో్, డీజిల్ ధరలను లీటర్ కు రూ.2 మేరకు తగ్గించిన కొద్ది రోజులకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 నుంచి రూ.8, డీజిల్ రూ.4 పెంచినట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొంది. అదనంగా పెట్రోల్ పై రోడ్ సెస్ ను లీటర్ కు రూ.1, డీజిల్ కు రూ.10గా నిర్ణయించారు. మార్చి 11న పెట్రోల్ ధరను రూ.2.69 మేరకు తగ్గించినా..డీజిల్ ధరలను రూ.2.33కు తగ్గించారు. మరో వైపు అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి భారీగా పడిపోయాయి.

Leave a Comment