బన్నీ కోసం ముగ్గురు విలన్లు..

అల వైకుంఠపురంలో సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ తో సినిమా చేస్తున్నారు. ఇ చిత్రంలో అల్ల అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో సుకుమార్ బన్నీని ఊర మాస్ గెటప్ లో చూపించనున్నాడు. ఈ చిత్రంలో బన్నీ సరసన క్యూట్ భామ రష్మిక మందన నటిస్తోంది. 

గంధపు చెక్కల నేపథ్యంలో సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కేరళ అడవుల్లో షూటింగ్ చేయాల్సి ఉండగా..అక్కడ కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ ను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. 

ఇక ఈ సినిమాలో బన్నీ ముగ్గురు విలన్లతో పోరాడనున్నారని తెలుస్తుంది. జగపతిబాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టిలను ప్రతి నాయకులుగా ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ముగ్గురితో బన్నీ ఫైట్స్ ఎలా ఉంటాయో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ చిత్తూరు యాసలో గడ్డంతో కనిపించనున్నాడని సమాచారం. 

Leave a Comment