బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా రాదు – బీజేపీ ఎంపీ

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కొనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మన దేశంలో మాత్రం కరోనా వైరస్ నివారణ కోసం మన నాయకులు వింత ప్రకటనలు చేస్తున్నారు. 

తాజాగా రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ సుఖ్బీర్ సింగ్  బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా రాదని చెప్పారు. శంఖం ఊదుతూ బురదలో కూర్చోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఇది కరోనాతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుందని అన్నారు. ఒళ్లంతా బుదర పూసుకుని శంఖం ఊది చేసి చూపించారు. అంతే కాక ప్రజలు ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ఎండ, వానలతో మమేకమవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

గత నెలలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. భాబీజీ పాపడ్ తింటే కరోనా రాదని చెప్పారు. ఈ పాపడ్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. ఈయన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. చివరికి ఆయనే కరోనా బారిన పడ్డారు. 

Leave a Comment