మొదటి పుట్టిన రోజు జరుపుకున్న ఏనుగు..!

శ్రీకుట్టి అనే గున్న ఏనుగు తన మొదటి పుట్టిన రోజును జరుపుకుంది. కేరళలోని కొట్టూర్ ఎలిఫెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఆదివారం ఈ ఏనుగు జంబో కేక్ ను కట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏనుగు గతేడాది నవంబర్ లో తీవ్ర గాయాలతో అడవిలో దొరికింది. అప్పటి నుంచి ఏనుగును రిహాబిలిటేషన్ సెంటర్ లో  అటవీ అధికారులు దాని ఆలనపాలన చేసుకున్నారు.   

Leave a Comment