2వ తరగతి బాలుడు గిన్నిస్ రికార్డు.. ఏం చేశాడో తెలుసా?

గుజరాత్ కు చెందిన ఆరేళ్ల బాలుడు అర్హం ఓం తల్సానియా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అతి పిన్న వయస్సులో కంప్యూటర్ ప్రోగ్రామర్ గా నిలిచి రికార్డులోకి ఎక్కాడు. అహ్మదాబాద్ కు చెందిన ఓ తల్సానియా సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. తన కుమారుడు అర్హం ఓం తల్సానియా కోడింగ్ పట్ల ఆసక్తి చూపిస్తుండటంతో అతనికి బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ను నేర్పించాడు.

 ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న అర్హం ఇటీవల పియర్సన్ వీయూ పరీక్ష కేంద్రంలో జరిగిన మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ భాషను క్లియర్ చేశాడు. దీంతో ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన కంప్యూటర్ ప్రోగ్రామర్ గా నిలిచాడు. పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ద్వారా తానే స్వయంగా చిన్న ఆన్ లైన్ గేమ్ రూపొందించానని అర్హం చెప్పాడు. వీటిని గిన్నిస్ బుక్ కమిటీకి పంపగా వారు తన ప్రోగ్రామింగ్ వర్క్ కు సంబంధించిన రుజువు కావాలని అడిగారన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ గేమ్ ను తానే డిజైన్ చేశానని నిర్ధారించుకున్న తర్వాత తనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ అందించారన్నారు.  

 

Leave a Comment