గుడ్లను ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి ! లేదంటే …

ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి గుడ్లు ఎంతో మంచివి. అందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. సాధారణంగా కరోనా సమయంలో గుడ్డు తినడం వలన రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చని డాక్టర్లతో పాటు ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. అందుకే మనలో చాలా మంది నిత్యం గుడ్లు తినడం అలవాటుగా చేసుకున్నారు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కోసం.

 

అయితే గుడ్లు తినే వాళ్ళు రోజూ దుకాణం కి వెళ్లి గుడ్లను కొనరు. ఎప్పుడో ఒకసారి వెళ్లి ట్రైన్లో లేదంటే డజన్ గుడ్లో తెచ్చుకుని వాటిని ఇంట్లో ఏదో ఒక చోట పెట్టుకుంటూ ఉంటారు. 95 శాతం మంది గుడ్లను ఫ్రిజ్లో పెడతారు. ఫ్రిడ్జ్  డోర్  వైపున ఉండే ప్రాంతంలో చిన్న ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ గుడ్లను అందులోనే నిలువ చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రాంతంలో గుడ్లను స్టోర్ చేయడం అంతా మంచిది కాదంటున్నారు నిపుణులు.

ఫ్రిడ్జ్ డోర్ పక్కన ఉండే ట్రేలో గుడ్లు పెడితే తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు మారుతూ, తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో గుడ్లు ఫ్రిడ్జ్ డోర్ ట్రేలో పెట్టడం వలన  గుడ్లు పాడవుతాయి. 

 

అయితే ఫ్రిడ్జ్ డోర్ పక్కన ట్రేలో ఎక్కువ రోజులు స్టోర్ చేసిన గుడ్లను తినకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఎక్కువ రోజులు పెట్టిన గుడ్లు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని అంటున్నారు.

 మరి ఫ్రిడ్జ్ డోర్ సైడ్ కాకుండా గుడ్లను ఎక్కడ స్టోర్ చేయాలి ? 

 

గుడ్లను ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచి మూత పెట్టాలి. ఆ కంటైనర్ను ఫ్రిజ్లో ఉంచి స్టోర్ చేసుకోవాలి. అప్పుడే గుడ్లకు సరైన రీతిలో  చల్లదనం అందుతుంది. అలా వాటిని ఈ చల్లదనం లో ఉంచడం వలన గుడ్లు ఎక్కువ రోజులపాటు నిలువ ఉంటాయి. తొందరగా పాడు అయ్యే అవకాశం ఉండదు.

అలాగే చాలామంది వండిన గుడ్లను కూడా ఫ్రిజ్లో చాలా రోజులు నిలువ ఉంచుతూ ఉంటారు.  గుడ్ల తో చేసిన కూరను, ఉడక పెట్టిన గుడ్లను  కూడా రెండు మూడు రోజులకు మించి ఎక్కువ రోజులు ఫ్రిజ్లో ఉంచకూడదు.అలాంటి వండిన గుడ్లను ఫ్రిజ్లో పెట్టి ఎక్కువ రోజులు నిలువ ఉంచి తినడం కన్నా బయట పడేయడమే మంచిదని నిపుణుల అభిప్రాయం.

 

 అందుకే గుడ్లు ఫ్రిజ్ లో స్టోర్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి 

Leave a Comment