ఫిట్స్ వచ్చినప్పుడు నోట్లో నురగ ఎందుకు వస్తుందో! మీకు తెలుసా?

సాధారణంగా కొంతమంది లో కిడ్స్ అనేది తరచుగా వస్తూ ఉంటుంది. అయితే ఫిట్స్ వచ్చినప్పుడు నోటినుంచి రావడాన్ని మీరు గమనించే ఉంటారు. చూసే వారికి ఇది కొంచెం భయానకంగా కనిపిస్తుంది. నిజానికి ఇది చాలా చాలా సాధారణ లక్షణం .ఫిట్స్ వచ్చినప్పుడు నురుగు ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫిట్స్ వచ్చినప్పుడు మింగడం ప్రక్రియ ఆగిపోతుంది. కానీ నోట్లో ఊరే లాలాజలం మాత్రం యధావిధిగా ఊరుతూనే ఉంటుంది. సాధారణంగా నోట్లో ఊరే లాలాజలం నిత్యం గుటక వేయడం వల్ల కడుపులో కి వెళ్తుంది అని అందరికీ తెలుసు. మనకు తెలియకుండానే మనం ఇలా ఎప్పటికప్పుడూ గుటక వేసి లాలాజలం మన కడుపు లోనికి పంపించుకుంటాం.

అయితే ఫిట్స్ వచ్చిన వారిలో గుటక వెయ్యి నందున ఆ లాలాజలం నోటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో ఊపిరితిత్తుల్లో నుంచి వచ్చే గాలి ఈ లాలాజలంలో బుడగలను సృష్టిస్తోంది. తద్వారా ఫిట్స్ వచ్చినప్పుడు ఈ బుడగలతో కలిసి బయటకు నురగ రూపంలో వస్తుంది . నిజానికి ముందు చెప్పినట్లుగా ఇదేమీ ప్రమాదకరమైన లక్షణం అయితే కాదు.

 

అంతే కాదు దీన్ని కిడ్స్ తీవ్రతకు లక్షణంగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఇలా చాలామంది నోటి నుంచి నురగ రావడాన్ని చూసి భయపడి రోగి దగ్గరికి వెళ్ళారు. కానీ ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా ఆ నురగ చూసి ఆందోళన చెందకుండా రోగిని సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలి.

 

Leave a Comment