గుజరాత్ యువతితో చిత్తూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి…

ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళు జరగడం సాధారణం అయిపోయింది. పట్టణంలోని రంగారెడ్డి వీధిలో కాపురం ఉంటున్న విజయ్ కుమార్ కొడుకు క్రషవ్ బెంగళూరు లోనే ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న గుజరాత్ కి చెందిన బహదూర్ సింగ్ కుమార్తె శివాని ,క్రషవ్  గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

 

వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లల్లో తెలిసి  ఇ కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమయ్యాయి. దీంతో ఆ ప్రేమికులు రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి వచ్చి కురబలకోట మండలం చేనేత నగర్ లో ఉండే ఒక ఆలయంలో స్నేహితుల సహకారంతో వివాహం చేసుకున్నారు.

 

అయితే వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరి కుటుంబాల నుంచి ఒత్తిళ్లు మరి అధికమయ్యాయి. దీంతో వీరు పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు వారికి రక్షణ కల్పించారు.

Leave a Comment