బెంగాల్ లో భారీ స్కామ్.. మంత్రి సన్నిహితురాలి ఇంట్లో నోట్ల కట్టలు..!

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు.  మంత్రి ఆప్తురాలైన అర్పిత ముఖర్జీ ఇంట్లో సోదాలు చేపట్టారు. సోదాల్లో అర్పిత ఇంట్లో రూ.20 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ నియామకాలు, ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డులో అవకతవకల నేరాలకు సంబంధించిన డబ్బుగా అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తం రూ.500, రూ.2 వేల నోట్ల కట్టలు ఉన్నాయి. బ్యాంక్ అధికారుల సాయంతో ఈ డబ్బును లెక్కించారు. 20కి పైగా సెల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

కాగా, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య తదితరుల నివాసాలపై ఈడీ దాడులు నిర్వహించింది. స్కామ్ తో సంబంధం ఉన్న వారి ఇళ్ల నుంచి కీలక పత్రాలు, అనుమానాస్పద కంపెనీల సమాచారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీ, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్కూల్ సర్వీస్ కమిషన్ కుంభకోణంలో మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.  

Leave a Comment