నీళ్లు, డిటర్జెంట్ లేకుండా..80 సెకన్లలో బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్..!

టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ వాషింగ్ మెషీన్లు బట్టలపై మురికిని తొలగించడానికి సుమారు 100 లీటర్ల నీటిని తీసుకుంటాయి. ఇక రసాయనాలతో తయారు చేసిన డిటర్జెంట్లు, దుర్వాసన పోగొట్టడానికి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నర్లు ఉపయోగించాలి.. ఇవన్నీ పర్యావరణానికి హానీ కలిగించేవే.. 

ఈ సమస్యకు ఓ స్టార్టప్ చెక్ పెట్టాడు.. కేవలం 80 సెకన్లలో, సగం కప్పు నీళ్లతో, డిటర్జెంట్ అవసరమే లేకుండా బట్టలను శుభ్రం చేసే వాషింగ్ మెషీన్ ని రూపొందించాడు.. చండీగడ్ కి చెందిన ‘80 వాష్’ అనే స్టార్టప్ నీటి వృథాను అరికట్టి, రసాయనాల వాడకాన్ని తగ్గించే వాషింగ్ మెషీన్ తయారు చేసింది. రుబుల్ గుప్తా, నితిన్ కుమార్ సలూజా, వీరందర్ సింగ్ ప్రారంభించిన ఈ స్టార్టప్ రూపొందించారు. ఈ మెషీన్ కొన్ని మిల్లీలీటర్ల నీటిని ఉపయోగించి, డిటర్జెంట్ లేకుండా 80 సెకన్లలో బట్టలు ఉతుకుంతుంది.

ఎలా పనిచేస్తుంది?

ఈ మెషీన్ ఐఎస్పీ స్టీమ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. పొడి ఆవిరి, అయనీకరణ చేయని మైక్రో కిరణాలతో బట్టలు శుభ్రం చేస్తుంది. బట్టలను ఈ వాషింగ్ మెషీన్ లో వేయగానే అయానీకరణ చేయని మైక్రో కిరణాలు బట్టలపై పేరుకొన్ని బ్యాక్టీరియాను పూర్తిగా చంపేస్తాయి.. తర్వాత సగం కప్పు నీళ్లు పొడి ఆవిరిగా మారి బట్టలపై ఉన్న మురికిని, దుర్వాసను తొలగిస్తాయి. ఇలా ఒక దశ పూర్తి కావడానికి 80 సెకన్ల టైమ్ పడుతుంది. మురికి ఎక్కువగా ఉంటే పలు దశల్లో పనిచేసి మురికిని వదిలిస్తుంది.     

Leave a Comment