ఢిల్లీలో మళ్లీ భూకంపం

దేశ రాజధాని ఢిల్లీ ఒకవైపు కరోనా వైరస్ మరోవైపు భూకంపంతో గజగజ వణికిపోతోంది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో 3.5 తీవ్రతతో కంపించిన భూమి, మళ్లీ సోమవారం కంపించింది. ఈ సారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.7గా నమోదైంది. నిన్న వచ్చిన భూకంప ఆందోళన నుంచి జనం తేరుకోక ముందే నేడు మరో భూకంపం రావడంతో ఢిల్లీ ప్రజలు భీతిల్లిపోతున్నారు.

వరుసగా రెండు రోజూ భూమి కంపించడంతో ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ వద్ద ఈ భూకంప కేంద్రం ఉంది. ఈ భూకంపానికి ఎలాంటి నష్టం జరగలేదు. కేవలం వస్తువులు మాత్రమే కింద పడ్డాయి. అయితే ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. 

 

Leave a Comment