సొంత ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ-పాసులు

లాక్ డౌన్ కారణంగా అనేక మంది తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. విద్య, ఉద్యోగం, పర్యాటం ఇతర కారణాల వల్ల చాలా మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు. వారి కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ-పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. తమ సొంత ఊరు, రాష్ట్రం వెళ్లాలనుకునే వారు http:/tps.koopid.ai/epass  లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం వారు ఈ-పాస్ ను పొందవచ్చు. అయితే ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్ మాత్రమే జారీ చేస్తారు. ఈ అవసరమైన వారు సంబంధిత పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, ప్రాంతం, ఇతర వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో పొందుపరిచిన వివరాల ఆధారంగా అన్ని అంశాలు పరిశీలించి తర్వాత ఆన్ లైన్ లోనే ఈ-పాసులు జారీ చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 

Leave a Comment