ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు, ఒక పోలీసు అధికారి మృతి

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని హంద్వారా పట్టణంలో ఆదివారం ఉదయం భారత జవాన్లు మరియు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు సోల్జర్స్, ఒకరు పోలీస్ అధికారి మరణించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక కల్నల్, ఒక మేజర్, ఇద్దరు ఆర్మీ జవాన్లు, పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ మరణించినట్లు సమాచారం. 

హంద్వరాలోని చంగిముల్లాలోని ఒక ఇంట్లో పౌరులను బంధీలుగా ఉంచినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంలో జమ్మూకశ్మీర్ పోలీసులు మరియు భారత సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి.ఐదుగురు భద్రతా సిబ్బందితో కూడిన బృందం ఉగ్రవాదులు ఆక్రమించిన ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులకు, మరియు భద్రతా సిబ్బంది మధ్య భారీగా కాల్పులు జరిగాయి. 

ఈ దాడిలో నలుగురు జవాన్లు, ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. అయితే పౌరులను సురక్షితంగా కాపాడినట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. మరణించిన వారిలో కల్నల్ అశుతోస్ శర్మ, మేజర్ అనూజ్ సూద్ మరియు జమ్మూకశ్మీర్ సబ్ ఇన్ స్పెక్టర్ షకీల్ ఖాజీతో సహా ఇద్దరు జవాన్లు అమరవీరులయ్యారు. 

Leave a Comment