చెప్పుల ప్రమోషన్ కోసం దుర్గమ్మ గెటప్.. పాప్ సింగర్ పై విమర్శలు..!

అమెరికన్ ర్యాపర్ కార్డిబి(american rapper cardi b) భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా వివాదం సృష్టించారు. ఓ కవర్ స్టోరీ షూట్ కోసం చెప్పులు చేతపట్టుకుని దుర్గమ్మ గెటప్ లో ఫొటోలకు పోజులిచ్చారు. రీబాక్ కంపెనీకి చెందిన స్నీకర్స్(reebok sneakers)ను ప్రమోట్ చేయడంలో భాగంగా కార్డి తన చేతుల్లో చెప్పులు పట్టకుని ఇలా స్టిల్స్ ఇచ్చారు. దీంతో భారతీయుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. చివరికి కార్డి భారతీయులను క్షమాపణ కోరారు.

కాగా కార్డి దిగిన ఫొటోలో ఎనిమిది చేతులతో కనిపిస్తూ చేతిలో షూస్ పట్టుకుని ఉంది. ఈ ఫొటోపై భారతీయులు మండిపడుతన్నారు. నీ బ్రాండ్ ప్రమోట్ చేసుకునేందుకు భారతీయులను కించపరుస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కార్డి భారయతీయులకు క్షమాపణ కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఓ దేవతను పోలినట్లు తాను కనిపించబోతున్నట్లు క్రియేటీవ్ టీమ్ తనకు చెప్పందని తెలిపింది.

 అయితే ఎవరి మనోభావాలను కించరపరచడం తన ఉద్దేశం కాదని, తాను చేస్తున్న అంశంపై ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సింది అని పేర్కొన్నారు. ఏదీ ఏమైనప్పటికి ప్రస్తుతం జరిగిపోయిన దానిని తాను మార్చలేనని, భవిష్యత్తులో ఇలాంటివి చేసేటప్పుడు పరిశీలించుకుంటానని చెప్పుకొచ్చింది.  

 

Leave a Comment