వధువుకు బదులు కాబోయే అత్త మెడలో దండ వేయబోయాడు.. వైరల్ వీడియో..!

పెళ్లిలో ఓ వరుడు చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు చేశాడంటే.. ఓ వరుడు తప్పతాగి పెళ్లి మండపానికి చేరుకుంటాడు. ఫుల్లుగా తాగి ఉండటంతో వరమాల మార్చుకునే సమయంలో వధువుకు బదులు ఆమె తల్లి అంటే కాబోయే అత్త మెడలో దండ వేయబోయాడు.

పక్కనున్న వారు ఈ ఘోరాన్ని గ్రహించి వరుడును పక్కకు జరుపుతారు. తర్వాత అతడి స్నేహితులు వధువు మెడలో దండ వేయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఫుల్లుగా తాగి ఉండటంతో వధువు మెడలో వరమాల వేయకుండానే స్టేజీ మీదే పడిపోతాడు.. ఇది చేసిన వారంత వరుడు చర్యకు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పడు జరిగిందో తెలియరాలేదు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment