కన్నడ భాషకు గూగుల్ లో అవమానం.. కన్నడిగులు ఆగ్రహం..!

కన్నడ భాషకు సంబంధించి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. భారతదేశంలో అత్యంత వికారమైన భాష ఏది అని గూగుల్ లో సెర్చ్ చేస్తే కన్నడ అని చూపిస్తోంది. అంతేకాదు.. దక్షిణ భారతదేశంలో సుమారు 4 కోట్ల మంది మాట్లాడే భాష అని కూడా చెబుతోంది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. 

దీనిపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం తమ భాషపైనే కాదని, తమపై తమ అస్థిత్వంపై జరుగుతున్న దాటి అంటూ మండిపడుతున్నారు. దీనిపై రాజకీయ నాయకులు సైతం స్పందించారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఎంపీ పీసి మోహన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ విజయనగర సామ్రాజ్యానికి నిలయం, విలువైన వారసత్వ సంపద కన్నడ భాష. కన్నడ భాషకు ప్రత్యేకమైన సంస్కృతి ఉందని అన్నారు. ప్రపంచంలో ఉన్న అతిపురాతన భాషల్లో కన్నడ కూడా ఒకటని పేర్కొన్నారు. 

Leave a Comment