కృత్రిమ కాలుతో అందాల పోటీకి.. మొట్టమొదటి మోడల్ గా ఐర్లాండ్ బ్యూటీ రికార్డు..!

కలలను సాకారం చేసుకోవడానికి వైకల్యం అడ్డురాదని నిరూపించింది బెర్నాడెట్ హగాన్స్ అనే యువతి. కృత్రిమ కాలుతో ఐర్లాండ్ జాతీయ అందాల పోటీకి ఎంపికైంది. 22 ఏళ్ల వయస్సులో బెర్నాడెట్ కు కీళ్ల క్యాన్సర్ సోకింది. దీంతో ఆమెకు కుడికాలు తీసేయాల్సి వచ్చింది. కాలు తీయడంతో తనతో పాటు తన కుటుంబం కూడా కృంగిపోయింది. 

అయితే కాలు పోయింది కదా అని బెర్నాడెట్ బాధపడుతూ కూర్చోలేదు.. తానేంటో నిరూపించుకోవాలనుకుంది. మెల్లగా కృత్రిమ కాలుకు అలవాడు పడింది. ఇప్పుడ అదే కాలితో ర్యాంప్ వాక్ చేయబోతుంది. ఆమె అభిలాషను గుర్తించిన జెబెడీ మేనేజ్మెంట్ అనే వికలాంగుల సేవా సంస్థ ఆమెకు అవసరమైన సహకారాన్ని అందించింది. ఆమె కల సాకారానికి అండగా నిలిచింది. 

బెర్నాడెట్ ఇప్పుడు మిస్ వరల్డ్ ఐర్లాండ్ పోటీల ఫైనలిస్టు జాబితాలో చోటు సంపాదించుకుంది. వచ్చే సెప్టెంబర్ లో ఈ ఫైనల్ పోటీలు జరుగనున్నాయి. దీంతో కృత్రిమ కాలితో ర్యాంప్ వాక్ చేయబోతున్న మొట్టమొదటి మోడల్ గా బెర్నాడెట్ రికార్డు నెలకొల్పబోతుంది. లోపాలతో కుమిలిపోయే వారికి గొప్ప ఇన్ స్పిరేషన్ గా నిలిచింది.  

Leave a Comment