‘మద్యం తాగి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులే’

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారు టెర్రరిస్టులతో సమానం అంటూ వ్యాఖ్యానించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోమవారం ఒక్కరోజే 402 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయయని చెప్పారు. సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ ఉంటాయని, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్ తో పాటు ఎస్వోటీ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొంటారని వెల్లడించారు. 

మద్యం తాగి వాహనాలు నడిపే వారెవరినీ వదిలేదని లేదని వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొదటి సారి పట్టుబడితే రూ.10 వేలు ఫైన్, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఇక రెండో సారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే నగరంలో కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు. 

 

Leave a Comment