ఈ జ్యూస్ తాగుతున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. దీంతో మనిషి జీవినశైలిలో మార్పులు వచ్చేశాయి. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. రెడీ టు ఈట్ ఫుడ్స్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ప్రజలు ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. 

ప్యాకేజ్డ్ జ్యూస్ పై కూడా ఎక్కువగా ఆధారపడుతున్నారు. మార్కెట్ లో అనేక రకాల ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్యాకేజ్డ్ జ్యూస్ తాగడం చాలా ప్రమాదకరం.. దీని వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ లు ఎంత హానీకరమో ఇప్పుడు తెలుసుకుందాం.  

ప్యాకేజ్డ్ జ్యూస్ తాగడం వల్ల కలిగే నష్టాలు..

  • ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ లను సురక్షితంగా ఉంచేందుకు.. ఎక్కువ కాలం పాడవకుండా ఉండేందుకు కొన్ని రకాల కెమికల్స్ కలుపుతారు. రసాయనాలు కలిపిన జ్యూస్ తాగడం పిల్లలకు చాలా హానికరం. పిల్లలకు ఎప్పటికప్పుడు ఫ్రెస్ ఫ్రూట్ జ్యూస్ లు అలవాటు చేయడం మంచిది. లేకపోతే ఫుడ్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
  • టెట్రాప్యాక్ ఫ్రూట్ జ్యూస్‌లు తాగడం వల్ల డయేరియా, మలబద్ధకం, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్యాకెట్ జ్యూస్‌లలో ఫైబర్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఫలితంగా జీర్ణ సమస్య ప్రధానంగా కన్పిస్తుంది.
  • మార్కెట్‌లో లభించే అన్ని జ్యూస్‌లలో కార్బానిక్స్, కాడ్మియం, మెర్క్యురీ వంటి కెమికల్స్ కలుపుతారు. ఇవి తాగడం వల్ల పిల్లల మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. 
  • ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు తరచూ తీసుకోవడం వల్ల స్థూలకాయం సమస్య కచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇందులో షుగర్ స్థాయి ఎక్కువగా ఉండి..బరువు పెరుగుతారు. 

 

 

Leave a Comment