కేంద్ర బడ్జెట్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి..!

భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతులను ముద్రించలేదు. కరోనా కారణంగా ఈసారి డిజిటల్ బడ్జెట్ కు కేంద్ర ప్రభుత్వం పరిమితమైంది. కాగా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 

ఈ బడ్జెట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్ ను తీసుకొచ్చింది. యూనియన్ బడ్జెట్(Union Budget App) పేరుతో ఓ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్ ను అభివృద్ధి చేసింది. ఈసారి పార్లమెంట్ లోని ఎంపీలకు కూడా ఈ బడ్జెట్ కు సంబంధించి డిజిటల్ కాపీలనే అందించనున్నారు. ఈ యాప్ లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బడ్జెట్ అందుబాటులో ఉంటుంది.  

Leave a Comment