తండ్రికే రూ.10 కోట్లు డిమాండ్ చేసిన 11 ఏళ్ల కుర్రాడు..

కన్న తండ్రికే రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు 11 ఏళ్ల కుర్రాడు. ఇవ్వకపోతే అసభ్యకరమైన చిత్రాలు వైరల్ చేస్తానని బెదిరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి మెయిల్ హ్యాక్ అయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి మెయిల్ కు అతనికి సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలు పంపించారు. 

తనకు రూ.10 కోట్లు ఇవ్వకపోతే ఆ పొటోలతో పాటు కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా వైరల్ చేస్తామని బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈక్రమంలో వారికి ఒక విషయం తెలిసింది. ఇంటి దొంగే హ్యాకర్ అని నిర్ధారణ అయింది. 

పోలీసులు కుటుంబ సభ్యులను విచారించిన తర్వాత హ్యాకర్ పిల్లాడు దొరికిపోయాడు. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో యూట్యూబ్ లో హ్యాకింగ్ ట్రిక్స్ నేర్చుకున్నానని ఆ కుర్రాడు తెలిపాడు. ఆ కుర్రాడు ఐదో తరగతి చదువుతున్నాడు. పోలీసులు ఆ కుర్రాడిపై కేసు నమోదు చేశారు.  

Leave a Comment