బ్యాంకులకు ఎవరూ రావొద్దు : SBI

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటికి 7వేలకుపైగా మరణించారు. మన దేశంలో 125పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో SBI తన ఖాతాదారులకు ఒక ముఖ్య సందేశం పంపింది. 

SBI  ఖాతాదారులు ఖాతాదారులు SBI yono యాప్ ను ఉపయోగించాలని మెసేజ్ లు పంపింది. SBI రీసెంట్ గా బ్యాంకింటగ్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్ల కోసం SBI yono యాప్ ను తీసుకొచ్చింది. కరోనా వైరస్ కారణంగా బ్యాంకింట్ ట్రాన్సాక్షన్ల కోసం బ్యాంక్ డిజిటల్ ఛానల్స్ ఉపయోగించండి అని SBI పేర్కొంది. అంతే కాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ కు అదనంగాం యాప్ ద్వారా ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ ను ఆపరేట్ చేయవచ్చని SBI పేర్కొంది. సొంత అకౌంట్ లేదా ఇతరుల అకౌంట్ కు డబ్బులు పంపొచ్చని, దీని కోసం బ్యాంకులకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. 

ఇ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, నెట్ బ్యాంకింగ్ మాత్రమే కాకుండా ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కూడా బ్యాంక్ కస్టమర్లు బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చని తెలిపింది. ఏ ఆప్షన్ అయినా బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లకుండానే చాలా సేవలు ఇంటి నుంచి పొందే అవకాశం ఉంది. అన్ని చోట్ల కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుంది. కనుక ఎవరూ బ్యాంక్ బ్రాంచులకు రావాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో నుంచే ఈ డిజిటల్ ఛానల్స్ ను ఉపయోగించుకోవడం మంచిది. 

Leave a Comment