హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులో 93 మేనేజర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్(టీఎస్పీఎస్సీ) విడుదల చేసింది.

వాటర్ బోర్డులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు. అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు..ఇలా ఉన్నాయి. 

మొత్తం పోస్టులు

హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులో వివిధ విభఆగాలలో మొత్తం 93 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సివిల్ విభాగం -79, మెకానికల్-06, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-04, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-03, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-01

వేతనం – ఎంపికైన వారికి జీతం స్కేల్ – రూ.37,100 నుంచి రూ.91,450 వరకు లభిస్తుంది. 

అర్హతలు – ఏఐటీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.

వయస్సు –18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. జులై 1, 2002 నుంచి జూలై 2, 1986 మధ్య పుట్టిన వారు అర్హులు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు ( టీఎస్ఆర్టీసీ / కార్పొరేషన్ / మున్సిపాలిటీ తదితర విభాగాల ఉద్యోగులకు వర్తించదు), ఎక్స్ సర్వీస్ మెన్ / ఎన్సీసీ ఇన్ స్టక్ట్రర్స్ కు 3 ఏళ్లు – ఎస్సీ / ఎస్టీ / బీసీలకు 5 ఏళ్లు, దివ్వాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

పరీక్ష విధానం ఇలా..

పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్కలు, సంబంధిత సబ్జెక్ట్ 300 మార్కులు, ఇంటర్వ్యూ 50 మార్కలు..మొత్తం 500 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ తెలుగు, ఇంగ్లీష్ 

భాషల్లో ఉండగా, సబ్జెక్ట్ ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. సిలబస్, పరీక్ష విధానం కోసం సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లో చూడవచ్చు. 

దరఖాస్తు చూసుకునే విధానం..

దరఖాస్తు చేయడానికి ముందు, అధికారిక వెబ్ సైట్ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) కోసం వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే నమోదు చేసుకున్నవారు టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీతో లాగిన్ అయి దరఖాస్తు పూర్తి చేయాలి. 

ఫీజు వివరాలు..

ఆన్ లైన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాలి. అలాగే పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి చెందిన బీసీ/ఎస్సీ/ఎస్టీ/ దివ్వాంగులకు/ఎక్స్ సర్వీస్ అభ్యర్థులు /34 ఏళ్లలోపు ఉన్న నిరుద్యోగులు పరీక్ష ఫీజు (రూ.120) చెల్లించనవసరం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన (నాన్ లోకల్) అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించడం తప్పనిసరి.

  • దరఖాస్తు గడువు – మార్చి 16 నుంచి 31వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
  • పూర్తి వివరాలు https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. 

జనరల్ స్టడీస్ సిలబస్ – 

  • కరెంట్ అఫైర్స్ – స్థానిక, జాతీయ అంతర్జాతీయ అంశాలు
  • అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
  • జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు
  • పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ – నివారణ విధానాలు
  • భారతదేశం – తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి
  • భారతదేశం- భౌతిక, సామాజిక, ఆర్థిక విధానం
  • తెలంగాణ – భౌతిక, సామాజిక, ఆర్థిక భౌగోళిక పరిస్థితి – జనాభా
  • ఆధునిక భారతదేశం సామాజిక – ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర..భారత జాతీయ ఉద్యమం
  • తెలంగాణ సామాజిక- ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం-ప్రాధాన్యం
  • భారత రాజ్యాంగం – రాజకీయ వ్యవస్థ, పరిపాలన, ప్రజావిధానం
  • లింగ, కులం, తెగ, దివ్వాంగులు తదితరల హక్కులు, ఎదుర్కొంటున్న సమస్యలు – సామాజిక మినహాయింపు
  • తెలంగాణ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు
  • లాజికల్ రీజనింగ్, అలలిటిక్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటెషన్
  • 10వ తరగతి స్థాయిలో బేసిక్ ఇంగ్లిష్
  • ఆయా ఇంజనీరింగ్ సబ్జెక్టుల సిలబస్ కోసం వెబ్ సైట్ లో చూడవచ్చు. 

Leave a Comment