వందేళ్లకు ఒక అంటూ వ్యాధి.. ఇప్పుడు కరోనా..!

కరోనా..కరోనా..కరోనా..ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. ఎవరు దగ్గినా..ఎవరు తుమ్మినా.. ప్రజలు గడగడలాడిపోతున్నారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పుడు మన ఇండియాలోనూ ఇది ప్రవేశించింది. భారత్ లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. 

అయితే ప్రతి శతాబ్దంలోనూ ఓ అంటు వ్యాధి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. మహమ్మారిలా మారి ప్రజలు ప్రాణాలను హరిస్తోంది. ఈ శతాబ్దంలో కరోనా భయాందోళనకు గురిచేేసినట్లు గత శతాబ్దాల్లోనూ కొన్ని అంటు వ్యాధులు ప్రజలను వణికించాయి. ఇలా కొన్ని అంటు వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందా…

1720లో ప్లేగు వ్యాధి ..

ఈ ప్లేగు వ్యాధి సృష్టించిన బీభత్సం పెద్దదే. ఇప్పటికి ఈ వ్యాధి పేరు వింటే భయపడాల్సిందే. ఈ వ్యాధి ఎలుకల నుంచి వచ్చింది. యూరప్ ఫ్రాన్సులోని మర్సెయిల్స్ లో బయటపడిన వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50 వేల మందిని బలి తీసుకుంది. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి విస్తరించింది. ఈ వ్యాధి కారణంగా లక్షల మంది చనిపోయారు..

1820లో కలరా వ్యాధి..

ప్లేగు వ్యాధికి వందేళ్లు పూర్తివుతుండగానే ఈ కలరా వ్యాధి బయటపడింది. ఇప్పటికి ఈ కలరా వ్యాధి గురించి ఎక్కడో ఓ చోట వినే ఉంటారు. ఫిలిప్పైన్స్ థాయ్ లాండ్ ఇండోనేషియా దేశాల్లో ఈ వ్యాధి కారణంగా లక్షమందికి పైనే చనిపోయారు. కలరా బ్యాక్టిరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు..

1920లో స్పానిష్ ఫ్లూ..

  ఇక కలరా వ్యాధి వచ్చిన మరో వందేళ్లకు స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చింది. 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడగా.. ఒక కోటి మంది మరణించారు. ఈ సృష్టిలో అతి పెద్ద విషాదం మిగిల్చిన అతి భయంకరమైన వ్యాధిగా స్పానిష్ ఫ్లూ గుర్తుండి పోతుంది..

2020లో కరోనా వైరస్.. 

స్పానిష్ ప్లూ వచ్చిన వందేళ్లకు ఇప్పుడు చైనాలో కరోనా వైరస్ వచ్చింది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఈ వైరస్ కు ఇంకా మందు కనిపెట్టలేదు. దీంతో ప్రపంచం మొత్తం భయపడుతోంది. ఇప్పటికే ఆరు వేల మందికి పైగా ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఇంకెతమందిని ఈ వైరస్ తీసుకుపోతుంని భయంతో ప్రజలు వణికిపోతున్నారు…

 

Leave a Comment